మూసికి పోటెత్తిన వరద
– భీమలింగ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీవాగు
– మూసి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఎస్ఐ యుగంధర్ గౌడ్
వలిగొండ ఏప్రిల్ 4 ప్రజాకలం: గురువారం సాయంత్రం హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని సంగెం సమీపంలో భీమలింగం మూసికి వరద పోటెత్తింది.దీంతోపాటు మూసి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసినదికి వరద పోటే త్తడంతో ముసినది మహెూగ్రరూపం దాల్చింది. మూసినది వద్ద లోలెవెల్ బ్రిడ్జ్ పై నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పోలీసులు, అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.స్థానిక ఎస్ఐ యుగంధర్ గౌడ్ తమ సిబ్బందితో భారీకెడ్లను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై యుగంధర్ మాట్లాడుతూ మూసి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు.దీంతో సంగెం, బొల్లేపల్లి,భువనగిరి, చౌటుప్పల్ మండలాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మూసికి పోటెత్తిన వరద
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on