వరంగల్, హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం..
హనుమకొండ ఏప్రిల్ 15 ప్రజా కలం ప్రతినిధి
నూతనంగా ఎన్నికైన హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలుస సుధీర్, ప్రధాన కార్యదర్శులు కొత్త రవి, దండాపంతుల రమాకాంత్
లకు శాలువాలు కప్పి,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఫోటోతో కూడిన జ్ఞాపికలను అందజేశారు.
ఈసందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగు స్థంబాలలో భాగమైన జ్యుడీషియరీ, మీడియాలు ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని అన్నారు. నూతనంగా గెలుపొందిన బార్ నేతలను సన్మానించికోవటం ద్వారా క్లబ్, బార్ ల గౌరవం మరింత ఇనుమడిస్తుందన్నారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్,
వైస్ ప్రెసిడెంట్ బోడిగే శ్రీను, జాయింట్ సెక్రటరీలు సంపేట సుధాకర్,డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్,సీనియర్ జర్నలిస్ట్ మక్దూం, యుగంధర్, ఉస్మాన్ పాషా, రవి, కొండ్రు దయాకర్, శామంతుల శ్రీనివాస్,శ్రీధర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం..
Recent Comments
Hello world!
on