Sunday, April 6, 2025
Homeతెలంగాణఅక్రమ మట్టి తరలింపుపై అధికారుల చర్యలేవి?

అక్రమ మట్టి తరలింపుపై అధికారుల చర్యలేవి?

అక్రమ మట్టి తరలింపుపై అధికారుల చర్యలేవి?
*రూ.2 కోట్ల ప్రభుత్వ ధనం లూటీచేసిన అక్రమార్కులు
*అధికారుల అండదండలతోనే మట్టిదందా
-బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సురేష్ రెడ్డి
పెద్దపల్లి,మార్చి 27:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావుతో పాటు ప్రభుత్వ అధికారి గిర్దావరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గతంలో ఆరుగురు ఇటుకబట్టీల యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరిపారని,విషయం వెలుగులోకి విచారణ జరిపిన అధికారులు అధికంగా ఉన్న మట్టిన ఒకచోట కుప్పలుపోయించి సీజ్ చేశారని తెలిపారు.టెండర్లు వేసి మట్టిన విక్రయించి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అధికారులు గతంలో తవ్వకాలు జరిపిన కంపెనీలకు మళ్ళీ ఎలా మట్టిని ఉచితంగా అప్పజెప్పుతారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేధిక ప్రకారం 70వేల మెట్రిక్ టన్నులకు గానూ లక్షా 65వేల 5వందల పది మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుకున్నారని పేర్కొన్నారు.దీనిపై రూ.38లక్షల 56వేల 3వందల ఇరవై తొమ్మిది జరిమానా విధించారని వివరించారు.జరిమానా చెల్లించకుండానే ఇటుకబట్టీల యాజమాన్యం మట్టిని తరలించడంపై సురేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
గిర్దావరు ఆడియో ప్రదర్శన
అక్రమంగా తరలిస్తున్న మట్టి వాహనాలను వదిలిపెట్టాలని గిర్దావరు సిబ్బందిని ఆదేశిస్తున్న ఆడియో లీకయ్యింది.ఆడియో సంభాషణను సురేష్ రెడ్డి విలేకరుల ముందు ప్రదర్శించారు.ఎవరి అండ చూసుకొని గిర్దావరు వాహనాలను వదిలిపెట్టమని ఆదేశిస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు.గత ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక,మట్టి దందా చేస్తూ రూ.కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడని, తాను గెలిచిన వెంటనే జైళుకు పంపిస్తా అంటూ తొడగొట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలకు ఏం సమాదానం చెబుతారని నిలదీశారు.
అక్రమార్కులను వదిలిపెట్టను
గత మూడేళ్ళుగా ఇసుక,మట్టి తవ్వకాలపై న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో విజయం సాధించానని తెలిపిన ఆయన,అక్రమార్కులను వదిలిపెట్టబోనని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటుకబట్టీల యజమానులకు వేసిన జరిమానాను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమచేయాలని డిమాండ్ చేశారు.కలెక్టరు,సంభందిత అధికారులు సత్వరమే స్పందించాలని సురేష్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments