ప్రభుత్వ భూమిలో అక్రమ దర్గా నిర్మాణం
-కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ హిందూ పరిషత్ అద్యక్షుడు రాజేష్ పటేల్
పెద్దపల్లి,ఏప్రిల్ 04:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి పట్టణంలోని విష్ణుపురి కాలనీలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా దర్గా నిర్మాణం జరిగిందని రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అద్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ ఆరోపించారు.ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని,వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు.అనంతరం విలేకరులతో జాపతి రాజేష్ పటేల్ మాట్లాటుడూ పెద్దపల్లి రెవెన్యూ శివారులోని విష్ణుపురి కాలనీలో సర్వే నంబర్ 891లో ఎకరం 21 గుంటల ప్రభుత్వ భూమి ఉందని,దాని విలువ దాదాపు15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.అయితే,ఈ భూమిలో రాత్రికి రాత్రే ఒక దర్గా నిర్మించారని,ఇది చట్ట విరుద్ధమని పేర్కోన్నారు.విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్గా నిర్మించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.అధికారులు తక్షణమే ఈ నిర్మాణాన్ని తొలగించి,ప్రభుత్వ భూమిని రక్షించాలని జిల్లా కలెక్టరేట్ లో అందజేసిన వినతి పత్రంలో పేర్కోన్నట్లు అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ తెలిపారు.
ప్రభుత్వ భూమిలో అక్రమ దర్గా నిర్మాణం
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on