ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి
పెద్దపల్లిలో క్రైస్తవుల శాంతి ర్యాలీ
పెద్దపల్లి, ఏప్రిల్ 07:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై నిజనిర్ధారణ చేయాలని కోరుతూ పెద్దపల్లి పట్టణ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అధికారులు ప్రవీణ్ పగడాల మృతిపై సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలకు మతం కన్నా మానవత్వమే ముఖ్యమని అన్నారు.ఆయన అనాథ పిల్లలను చేరదీసి విద్యను నేర్పించడమే కాకుండా వారి వివాహాలు కూడా జరిపించారని కొనియాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కుల నిర్మూలనకు పాటుపడుతూ మనుషులను మతంతో కాకుండా మానవత్వంతో చూడాలని ఆయన బోధించేవారని గుర్తు చేశారు.ఇండియన్ మిషన్ స్కూల్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కొనసాగింది.అక్కడ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు మరియు క్రైస్తవులు పాల్గొన్నారు.
ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి
Recent Comments
Hello world!
on