మెతుకు సీమ జర్నలిస్ట్ కు ఉగాది పురస్కారం
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసిన జర్నలిస్ట్ శ్రీధర్
ఈయన చేసిన సేవ మర్చిపోలేమంటున్న ప్రజలు
మెదక్ ఏప్రిల్ 13(ప్రజాకలం ప్రతినిధి) మెతుకు సీమ జర్నలిస్ట్ కు ఉగాది పురస్కారం.కొల్చారం మండల గ్రామానికి చెందిన తిమ్మన్నగారి శ్రీధర్ జర్నలిస్ట్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు. మెదక్ వి6 వెలుగు ప్రతినిధి తిమ్మన్నగారి శ్రీధర్ ఇప్పటికీ ఇది నాల్గవ అవార్డు,ఈనాడు వెలుగు వంటి దినపత్రికలో 31 సంవత్సరాలుగా జర్నలిస్టుల రంగంలో తనదైన శైలిలో సేవలందించారు.తిమ్మనగారి శ్రీధర్ కొల్చారం గ్రామంలో కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ కొల్చారం లో నిర్వహించే అన్ని కార్యక్రమాలు తనవంతుగా సేవలు అందిస్తూ మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిస్ట్ రంగంలో తన ప్రతిభతో వార్తలను ప్రజలకు తను రాసే కథనాలు పట్ల ఆసక్తి చూపుతారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతో మంచి పేరు పఖ్యాతలు తెచ్చుకున్నారు.శనివారం రోజు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మెదక్ జిల్లాతో పాటు కొల్చారం మండలంలో ఉన్న జర్నలిస్టులు బంధువులు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి తిమ్మనగారి శ్రీధర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వి6 వెలుగులో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీధర్ సొంత గ్రామం అయినా కొల్చారం లోని మిత్రబృందం శ్రీధర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మెతుకు సీమ జర్నలిస్ట్ కు ఉగాది పురస్కారం
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on