మాజీ స్పీకర్
స్వర్గీయ దుదిల్ల పాదరావుకి ఘన నివాళులు
మెట్ పల్లి: ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజా కలం) ఈరోజు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అనంతరం వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్,వెంకట గిరి,యండి జఫర్,బైండ్ల శ్రీకాంత్, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.