‘యువతలో పెరుగుతున్న హిందూ భావన, దేశభక్తి’. …
– ప్రతి శనివారం ‘హనుమాన్ చాలీసా పారాయణంతో’ మారుమ్రోగుతున్న శ్రీరామదూత ఆలయాలు
– వి హెచ్ పి, బజరంగ్దళ్ ప్రతినిధుల చొరవతో ఆధ్యాత్మికత వైపు మళ్లుతున్న చిన్నారులు, యువత, మహిళలు ప్రజలు….
– హలో.. హాయ్.. నమస్తే… కు బదులుగా జైశ్రీరామ్ అంటూ పలకరింపు….
– గోరక్షణలో సైతం ముందుకు దూసుకెళ్తున్న యువత….
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 04 ప్రజా కలం ప్రతినిధి : ప్రస్తుతం సమాజంలో ఎటు చూసినా క్షణం తీరిక లేకుండా ఉరుకుల, పరుగుల జీవితం.. ఏ వృత్తిలో అయినా తప్పని ఒత్తిడి… ఆర్థిక, వృత్తి పరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం మునిగి తేలాల్సిన పరిస్థితులు. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. యువతపై ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు, మనసును సాంత్వన పరుచుకునేందుకు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు.. భగవంతుడే అంతిమ సత్యం అన్న విషయాన్ని గ్రహించేందుకు మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తర్వాత …జీవితంలోని కల్లోల పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శన తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తుల రద్దీ..కృష్ణారామా అనుకుంటూ తీర్థయాత్రలు చేయాల్సిన వయసు అని.. వృద్ధాప్యం గురించి తెలుగు నాట ఓ సామెత ఉంది. బాధ్యతలన్నీ తీరిపోయి.. పిల్లలు, వారి పిల్లలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వడంతో శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు, మరణం తర్వాత ఏమవుతుందన్న సందేహాలకు దూరం జరిగేందుకు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరే వారు. కానీ ఇప్పుడా సామెత మార్చి రాయాల్సిన సందర్భం వచ్చేసింది. ఖాళీ దొరికితే ఆలయాలకు పరుగులు తీస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రత్యేక పూజలు, పొర్లు దండాలు, ఉపవాసాలు, మొక్కులు అంటూ ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తులు కనిపిస్తూనే ఉన్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు యువత పోటీ..
ఒకప్పుడు వెకేషన్ అంటే ఏ గోవానో ఇంకేదో బీచ్‌కు వెళ్లడమో అన్న అభిప్రాయం ఉండేది. కానీ గత వేసవికాలంలో దేశంలో ఎక్కువమంది ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులన్నీ ఆలయాల సందర్శనకు సంబంధించినవే. దక్షిణ భారతదేశంలో ఆలయాలతో పాటు చార్ ధామ్, అయోధ్య, వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించేందుకు యువత పోటీ పడింది. పుణ్యక్షేత్ర దర్శనం, పర్యాటక ప్రాంతాల సందర్శనం కలిపి ఉన్న టూరిజం ప్యాకేజీలతో కొన్ని కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. మన దేశంలోనే కాదు విదేశాల నుంచీ భక్తులు మన ఆధ్యాత్మిక క్షేత్రాలకు భారీగా తరలివస్తున్నారు.
హాయ్.. హలో.. నమస్తే… కు బదులు జైశ్రీరామ్…
ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ప్రతినిధులు చొరవతో ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో, మారుమూల తండాలలో కూడా ఆధ్యాత్మిక భావన రోజురోజుకు పెరుగుతోంది. గత సంవత్సర కాలంగా ప్రతి శనివారం మన ఆలయాల్లో నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతూనే ఉంది. ఇందుకు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ప్రతినిధులైన వినోద్ కుమార్, తులసీదాస్ లతో పాటు పలువురు యువకులు గ్రామ గ్రామం తిరిగి, తండా తండా తిరిగి ఆధ్యాత్మిక భావనపై అవగాహన కల్పించడమే కారణం. అలాగే విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కమిటీలో ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆధ్యాత్మిక భావన భక్తి భావన పెంచుతున్నారు. అంతేగాక గోసేవ చేస్తూ గోవులను కబేలాలకు తరలిస్తున్న లారీలను ఆపుతూ వాటిని రక్షిస్తూ ఉన్నారు. ఇందుకోసం యువత రాత్రింబవళ్లు శ్రమిస్తూ గోవులను కాపాడుతున్నారు. ప్రతి శనివారం రాత్రి 7:00 అయింది అంటే చాలు ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలు చాలీసా పారాయణానికి వచ్చే చిన్నారులు యువకులు మహిళలతో నిండిపోతున్నాయి.
ప్రతి శనివారం తప్పకుండా చాలీసా కు వెళ్తా…..
– గోనె సాయి చరణ్, ఆరో తరగతి విద్యార్థి.
నేను ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్నాను. ప్రతి శనివారం తప్పకుండ హనుమాన్ చాలీసా పారాయణానికి వెళ్తాను. నేను హనుమాన్ చాలీసా పారాయణానికి వెళ్లినప్పటినుండి ఆధ్యాత్మిక గీతాలు పాడటం అలవాటు చేసుకున్నారు. అలాగే హిందూ సమాజం గురించి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నేను మా దోస్తులను జైశ్రీరామ్ అనే పలకరిస్తారు. చాలీసా పారాయణం తర్వాత భజన కీర్తనలతో పాటు దేశభక్తి గీతాలు ఆలపిస్తాను.
హిందూ ధర్మరక్షణకు తన వంతు కృషి ….
– విహెచ్పి కామారెడ్డి జిల్లా సంఘటన మంత్రి వినోద్ కుమార్
హిందూ ధర్మ రక్షణకు నా వంతు కృషి చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హిందుత్వం ఉంటే ఎంతో ఇష్టం. అందు మూలంగానే ఆర్ఎస్ఎస్,భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాల వైపు ఆకర్షతుడైనయ్యాను. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేలా చూస్తున్న. విశ్వహిందూ పరిషత్ యొక్క సంకల్పం నెరవేర్చడానికి ఏ సమయంలో అయినా సరే ముందుంటా. చిన్నారులు, పెద్దలు, యువత, మహిళలు అందరూ కూడా ఆధ్యాత్మికత వైపు అడుగులేస్తే మన యొక్క సనాతన ధర్మం, మన సంస్కృతులను సంప్రదాయాలను మనం కాపాడుకోగలగా వ్యక్తులుగా తయారవుతాం.
గోరక్షయే తన ప్రథమ కర్తవ్యం..
– కామారెడ్డి జిల్లా విశ్వహిందూ పరిషత్ గోరక్ష ప్రముఖ్ తులసీదాస్
చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న గోవధ ను నిషేధించడమే తన ప్రథమ కర్తవ్యం. ఇందులో భాగంగా ఎన్నోసార్లు కబేళాలకు తరలిస్తున్న గోమాతలను అడ్డుకొని రక్షించడం జరిగింది. గోమాత తల్లి వంటిది దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరుగుతూ ప్రజలను గోవులను విక్రయించకూడదని చైతన్యం చేస్తున్నాను. ఈ నిరంతర ప్రక్రియలో తాను ఎల్లప్పుడూ ముందుంటాను.