Monday, April 7, 2025
Homeతెలంగాణకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ బిజెపి పోరుబాట
ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టించుకోరా
తెలంగాణలోని అత్యధిక పన్నులు చెల్లించే కార్పొరేషన్ బడంగ్ పేట్
మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్
మహేశ్వరం, ఫిబ్రవరి 18, (ప్రజా కలం)
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1,2 బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీరకర్ణ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ లో ఉన్న పలు కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ పోరుబాట కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టారు అందుకు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హాజరై కాలనీ వాసులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న కానీ పలు కాలనీలో ఈనాటికి డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్య, మంచినీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలోని అత్యధిక పన్నులు చెల్లించే కార్పొరేషన్ బడంగ్ పేట్ కార్పొరేషన్ మరి అలాంటి కార్పొరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ సాయి నగర్ కాలనీ వాసులు గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కాలేదని దాని కారణం అక్కడ ఉన్నటువంటి నాలా కబ్జాకి గురి కావడం ఆ కబ్జాదారులకు సబితా ఇంద్రారెడ్డి అండగా ఉండడం వలన నేటికీ ఆ కాలనీ సమస్యలు పరిష్కారం కావట్లేదని అన్నారు. స్వయంగా ఇరిగేషన్ వారు ఇచ్చిన మ్యాప్ లో ఆ కబ్జాదారులు నాలాను ఆక్రమించారని స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. వెంటనే శివ సాయి నగర్ కాలనీ సమస్యను తీర్చాలని అలాగే మిగతా కాలనీలలో ఉన్నటువంటి రోడ్డు సమస్యలను, డ్రైనేజీ సమస్యలను, మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీరాములు గారు కాలనీవాసులతో కలిసి అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు. అధికారులు కాలనీల సమస్యలను పట్టించుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని లేనియెడల తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మాజీ సర్పంచ్ రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు నడి నడికుడ యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గౌర రమాదేవి శ్రీనివాస్, బంగారు అనిత ప్రభాకర్, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, గూడెపు ఇంద్రసేన సాకార బ్యాంకు డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి, తోట ప్రతాప్ రెడ్డి, గిరి రాజ్, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శివారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ఏనుగు రామిరెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, చిత్రం శ్రీనివాస్, కళ్లెం లక్ష్మారెడ్డి, మర్రి అంజిరెడ్డి, బెల్దే రాజు, రావుల మల్లేష్, రేసు నర్సింహారెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, ఎండి నయీమ్, మంగపతి నాయక్, శీను నాయక్, మోతిలాల్, దేశపాక జగన్, నిమ్మల రవికాంత్ గౌడ్, నర్సింగ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, మంత్రి అశోక్, ప్రవీణ్ గౌడ్, బిట్టు, సైదులు, లక్ష్మణ్, తీగల సురేందర్ రెడ్డి, కుంటి భాస్కర్, సాయి సంతోష్ లక్ష్మీనారాయణ, రాంబాబు, మహిళా మోర్చా సభ్యులు నివేదిత, పద్మ, బాలమణి, అర్చన, కావ్య, అనిత, బీజేవైఎం నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, సతీష్ నంద, స్వీకృత్ రెడ్డి, క్యారగారి అరవింద్, పవన్ కుమార్, రాహుల్, భరత్ ముదిరాజ్, మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments