పసుపు పంట ఎత్తుకెళ్లిన దొంగలు
మెట్ పల్లి: ప్రతినిధి ఫిబ్రవరి 22 (ప్రజా కలం) వేంపేట్ గ్రామానికి చెందిన ఎలేటి వినోద్ రెడ్డి అనే రైతు తన పంట పొలంలో వచ్చిన పసుపును ఉడికించి తన కల్లంలో ఆరబోయగా, శుక్రవారం మధ్య రాత్రి గుర్తుతెలియని దొంగలు అర్ధరాత్రి దొంగిలించారు. దాదాపు నాలుగు కడాయిలు ఉడకబెట్టి ఆరబెట్టగా, గమనించిన దొంగలు పసుపు కొమ్మును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.పంట విలువ దాదాపు ముప్పై వేల వరకు ఉంటుందని, పది నెలలు కష్టపడి పండించిన పంట దొంగల పాలవటం వల్ల రైతు కన్నీరు మున్నిరవుతున్నాడు. ఇప్పటివరకు వాహన దొంగలను ఇళ్ల దోపిడీల ఆస్తులను కాపాడుకుంటున్న తమకు పంట ధాన్యాన్ని ఎత్తుకు వెళ్లడం పట్ల గ్రామంలోని మిగతా రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. కాక బాధిక రైతు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.