కల్తీ ఆయిల్ పై వినూత్న ప్రదర్శన
మెట్ పల్లి: ప్రతినిధి ఫిబ్రవరి 25 (ప్రజా కలం) కల్తీ ఆహార పదార్థాలతో పాటు వంట నూనెలు నాణ్యమైన వాడదామని పట్టణానికి చెందిన విస్ డమ్ పాఠశాలకు చెందిన చిన్నారుల ప్లకార్డు ప్రదర్శన పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఇటీవల కల్తీ ఆహార పదార్థాలతో పాటు పంటనూనెల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్న విషయం తెలిసిందే. కల్తీ నూనె తో తయారు చేసిన ఆహారంతో అనారోగ్యంతో పాటు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నది తెలిసిందే. ఇంటి అవసరాలకు, వ్యాపారులకు తెలిసేలా అందరం నాణ్యమైన వంట నూనెను వాడదాం అని చాటి చెప్పేలా చిన్నారులు ప్రదర్శించిన తీరు అందరిని ఆలోచింప చేస్తోంది. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళుతున్న సందర్భంగా చిన్నారులు ఇలా కనిపిస్తే మెట్ పల్లి “ప్రజా కలం” ఫొటో “క్లిక్” మనిపించింది.