సీసీ రోడ్డు పనులు చేపట్టేది ఎన్నడో?
– మంజురైనా నేటికీ ప్రారంభం కాని సీసీ రోడ్డు పనులు
– రంజాన్ కి మిగిలింది 3 రోజులే..
నిజామాబాద్ : జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 (ప్రజా కలం)
నగరంలోనీ ముంతాజ్ నగర్‌లోన గల డ్రైవర్స్ కాలనీలోని డివిజన్ నెం.(12)లో, మస్జీద్ ఎ మహమూద్ ఎదురుగ బిటి రోడ్డు వేయడానికి 3 ఎన్ల క్రితం రోడ్డు మంజూరు చేశారు. కానీ మహమూద్ మసీదు నుంచి నాజ్ మసీదు వరకు రోడ్డు మంజూరైనా పనులు నేటి వరకు ప్రారంభం కాలేదు. సరైన రహదారి లేకపోవడంతో వీధి ప్రజలు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్డు నుండి నమాజ్‌కు వెళ్లే వారు కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల ఉన్న 17 మసీదులను శుభ్రపరిచే పని ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా రంజాన్ మాసానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతీ మసీదు దగ్గర శుభ్రపరిచే పనిని త్వరగా ప్రారంభించాలని డివిజన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, మంజూరైనా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించక పోయినా కనీసం అన్ని మసీదుల దగ్గర మొరం మట్టి/ఇసుకనైనా మంజూరు చేయలని ముంతాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు,షేక్ ఎ జాజ్ మరియు డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
సీసీ రోడ్డు పనులు చేపట్టేది ఎన్నడో?
Recent Comments
Hello world!
on