Saturday, April 5, 2025
HomeHeadlinesవిద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయి - నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్...

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయి – నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు గారు

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయి

– నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు గారు

 

మెట్ పల్లి : ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజా కలం) విద్యార్థులు భవిష్యత్ తరాలకు చెందిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదపడతాయని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీజేపీ సీనియర్ నేత ప్రముఖ వైద్యులు చిట్నేని రఘు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ కాన్వెంట్ హైస్కూల్ లో శుక్రవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులను ఏర్పాటు చేశారు. ఆయన విశిష్ట అతిథిగా సూచన. విద్యార్థులు రూపొందించిన పలు సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విధమైన సైన్స్ ఫెయిర్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇందులో దాదాపు 1000కి పైగా ప్రాజెక్టులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఆధునిక కాలంలో వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించాలని సూచించారు. ఈ రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రజలు మిడిమిడి నమ్మకాలను నమ్మకుండా నిరోధించడంలో ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అదే విధంగా నిఖిల్ భరత్ కాన్వెంట్ హైస్కూల్ యాజమాన్యం 25 సంవత్సరాలుగా ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. జగిత్యాల జిల్లాలోనే నెంబర్ వన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా గుర్తింపు పొంది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటను వేశారు. ఇప్పటివరకు సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం విశేషమని, ఇక్కడ చదువుకున్న వారిలో సుమారుగా 85 మంది విద్యార్థులు వైద్య వృత్తిలో, 100 వందల మంది విద్యార్థులు ఇంజనీర్లుగా సేవలందిస్తూ ఉండటం అభినందనీయమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లో కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం, సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారిగా మరో విద్యార్థి పనిచేస్తుండడం విశేషమని అన్నారు. ఇంకా అమెరికా, లండన్, జర్మనీలాంటి దేశాల్లో సైతం ఇక్కడి విద్యార్థులు వివిధ విభాగాల్లో పనిచేస్తుండడం హర్షణీయమన్నారు. ఇప్పటివరకు పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడం పాఠశాల గుర్తింపును రెట్టింపు చేస్తుంది, భవిష్యత్తులో మరింతమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని. కాగా విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఈ సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. సైన్స్ ఫేయిర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ వెలికి వచ్చింది.విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యం పని, ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థుల ప్రతిభను గుర్తించడం గురువుల బాధ్యత అని, విద్యార్థులు ఇక్కడ కాకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా సైన్స్ ఫెయిర్‌ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పెద్ద పెద్ద గోల్స్ క్రియేట్ చేసుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలి. ఇప్పుడు కష్టపడి, ఇష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బంగారు బాటవుతుందని, 25 సంవత్సరాలు ఇష్టపడి చదివితే మిగిలిన 75 సంవత్సరాలు మంచి జీవితం పొందవచ్చన్నారు. ఇతర రంగాల్లో విజయం సాధించిన వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించవచ్చన్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు గారు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి సత్కరించారు.కాగా ఈ విశిష్ట అతిథిగా హాజరైన నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు గారి పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, పాఠశాల వ్యవస్థాపకులు, మండల విద్యాధికారి మేకల చంద్ర శేఖర్, ప్రధానోపాధ్యాయులు వీ.బీ మహర్షి, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, న్యాయవాది ఆకుల ప్రవీణ్, నాయకులు జియా హుల్ హక్, మార్గం హన్మాండ్లు, అంగడి పురుషోత్తం, బర్ల రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments