Saturday, April 5, 2025
HomeUncategorizedప్రమాదాలు జరిగితే తప్ప స్పందించరా..? నడి రోడ్డుపై గుంతలు

ప్రమాదాలు జరిగితే తప్ప స్పందించరా..? నడి రోడ్డుపై గుంతలు

ప్రమాదాలు జరిగితే తప్ప స్పందిస్తారా..?

నడి రోడ్డుపై గుంతలు*

చోద్యం చూస్తున్న అధికారులు*

రుద్రంగి, మార్చి 05, (ప్రజాకలం ప్రతినిధి)*

సర్పంచ్ లు లేక గ్రామాల్లో పాలన పడకేసిందనడానికి నడి రోడ్డు పై గుంతలు ఏర్పడి రోజులు గడుస్తున్న ఎవరు పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మహాలక్ష్మీ వీధి వద్ద మురుకు నీరు వెళ్ళేందుకు రోడ్డు కింది నుండి డ్రైనేజీ ఏర్పాటు చేయగా రోడ్డు మద్యలో రంద్రం ఏర్పడి వాహనదారులకు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అలాగే పీరీల మసీదు నుండి బస్టాండుకు వెళ్ళే దారిలో ములమలుపు వద్ద కూడా మెదడు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇలా గుంతలు పలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. రోజులు గడిచిన అధికారులు పట్టించుకోవడం లేదని, దీని వలన నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు చేస్తున్నారు. ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అంటూ వాహనదారులు, పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఏర్పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments