అమృత మిల్క్ సెంటర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
తనిఖీల్లో వెలుగు చూసిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి05 (ప్రజా కలం)సామాన్య మధ్యతరగతి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు నాసిరకం ఆహార పదార్థాలతో వివిధ రకాల పదార్థాలను తయారు చేసి ప్రజలకు రోగాలను అంటగడుతూ వారు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో నిరంతరం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు కొనసాగుతున్న కొందరు తమ పద్ధతిని మార్చుకోకపోగా దాడులు తమను ఏమి చేస్తారో చోటా మోటా నాయకుల అండదండలను చూసుకొని కొందరు వ్యాపారులకు ఆడింది ఆట.. పాడింది పాటగా కొనసాగుతోంది.మెట్ పల్లి పట్టణంలోని రాజ కళామందిర్ సినిమా టాకీస్ లేడీస్ గేట్ వద్ద ఉన్న అమృత మిల్క్ సెంటర్‌లో బుధవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆకస్మికంగా తనిఖీ చేశారు.కల్తీ నెయ్యి,అన్ని రకాల పచ్చళ్ళు వాటిని తయారు చేయడానికి వెబ్‌సైట్ కల్తీ పదార్థాలను సీజ్ చేశారు.మిగత కొన్ని పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో డంపింగ్ యార్డ్ కు ఉంచారు. అమృత మిల్క్ సెంటర్ విక్రయిస్తున్న పదార్థాలు కాలం చెల్లినవిగా పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అమృత మిల్క్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు పదార్థాలను ఎక్స్‌పైరీ గమనించిన తర్వాతనే కొనుగోలు చేయాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష సూచించారు. మరొక్కసారి అమలు కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ స్పెక్టర్ అనూష హెచ్చరిక.