గంజాయి విక్రయతల అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీఐ నిరంజన్ రెడ్డి
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 8 (ప్రజాకలం) (మహ్మద్ అజీమ్) :గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ తన సిబ్బందితో వేంపేట ఎస్ ఆర్ గార్డెన్స్ ముందు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఒక మోటారు సైకిల్ పై రాగా వారిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభించిందన్నారు. వారిని విచారించగా ఎర్రపూర్ తండా ఇబ్రహీంపట్నం మండలంకు చెందిన సునావత్ సాయి నాయక్ అని, రెండవ వ్యక్తి నిర్మల్ జిల్లా సత్తెనపల్లి అజ్మీర శ్రీనివాసు నాయక్ వారిద్దరు కలిసి నిర్మల్ జిల్లాలోని కొమ్మ గూడెం వద్ద చౌహన్ రమేష్ నాయక్ వద్ద 3000 రూపాయలు పెట్టి గంజాయి కొనుక్కొని మెట్టుపల్లిలో వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఎక్కువ ధరకు విక్రయించడానికి వస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వెంటనే వారిని అదుపులోనికి తీసుకొని గంజాయిని బైకును, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను, గంజాయిని స్వాధీన పరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేయగా సిఐ నిరంజన్ రెడ్డి వారిని రిమాండ్ కు తరలించి పరారీలో ఉన్న చౌహాన్ రమేష్ ను త్వరలోనే పట్టుకొని తగు చర్య తీసుకుంటామని సిఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
గంజాయి విక్రయతల అరెస్ట్
Recent Comments
Hello world!
on