Saturday, April 5, 2025
Homeక్రైమ్ప్రయాణికుల సురక్షిత ప్రయాణం,భద్రత కోసం

ప్రయాణికుల సురక్షిత ప్రయాణం,భద్రత కోసం

ప్రయాణికుల సురక్షిత ప్రయాణం,భద్రత కోసం
కోరుట్ల పట్టణంలో 350 ఆటోలకి కోడ్ తో అనుసంధానం
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మెట్ పల్లి: (కోరుట్ల) ప్రతినిధి, మార్చి 8 (ప్రజాకలం) (మహ్మద్ అజీమ్) :మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత ప్రయాణం ,భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు,సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారంను అప్ క్యూ ఆర్ కోడ్ ను కోరుట్ల పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంబించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత, భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంబించడం సంతోషంగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 4000 లకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు 2093 లకు పైగా ఆటోలకు క్యూ ఆర్ కోడ్ లను వేయడం జరిగిందన్నారు. రాబోవు రోజుల్లో మిగతా ఆటోలో కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు కోరుట్ల పట్టణంలో సుమారు 350 ఆటో లకు ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా స్టిక్కరింగ్ చేయడం జరిగిందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని అన్నారు. ప్రయాణికులకు భద్రత, నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఆటో డ్రైవర్లకు ఉందని తెలిపారు. అనే స్టిక్కరింగ్ ద్వారా అనుకోని సంఘటనలు జరిగునప్పుడు తొందరగా గుర్తించవచ్చునని అలాగే విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు సులభంగా పట్టు కోవచ్చునని తెలిపారు. కోడ్ ఉండటం వల్ల డ్రైవర్లు క్రమశిక్షణ మరియు బాధ్యతతో ఆటోలు నడుపుతారని చెప్పారు.ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన, దురుసుగా మాట్లాడిన, మరేయితర సమస్యలు ఎదుర్కొన్న ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.

ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది వారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందవేయడంతో వెంటనే స్పందించి వాహనం లైవ్ లొకేషన్ కి చేరుకుంటారని అన్నారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు అని పరిమితిని మించి ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటాం అన్నారు.మద్యం తాగి వాహనాలు నడపడం నేరం అని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చెస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు ఆర్ టి ఓ శ్రీనివాస్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ,కోరుట్ల సీ.ఐ సురేష్ బాబు,ఎస్. ఐ లు శ్రీకాంత్, శ్యామ్ రాజ్ , నవీన్, రాంచంద్రం పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు,ఓనర్స్ పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments