పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు
— ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
— 15 నెలల్లోనే ప్రజల ముంగిట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలు.
— అర్హులకు విడుదల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు.
— అంకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసిన ఎమ్మెల్యే
కాల్వశ్రీరాంపూర్,మార్చి10:(ప్రజాకలం ప్రతినిధి) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు విడుదలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్లతో నెరవేర బోతుందని ఎమ్మేల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.మండలంలోని అంకంపల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసి పనులను ఎమ్మేల్యే స్థానిక నాయకులతో కలసి ప్రారంభించరు.ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ.సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అన్నారు.ఇన్ని సంక్షేమ పథకాలు ఈదేశంలో ఎక్కడ కూడా లేవు అన్నారు.ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అన్నారు.నాలుగేళ్ల కాలంలో 14 వేల ఇండ్లు మంజూరు అవుతాయి అన్నారు. మండలంలోని అంకంపల్లెను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని గ్రామానికి రేషన్ కార్డులు,రైతు భరోసా,రైతు ఆత్మీయ భరోసా పథకాలు అందివ్వడం జరుగుతుంది అన్నారు.అందులో గ్రామంగా అంకం పల్లెకు 119 ఇండ్లు మంజూరైనాయి అన్నారు.దీంతోపాటు మరో 15 రోజులలో నియోజకవర్గంలోని 126 గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయి అన్నారు.గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కానీ ఒక్క రేషన్ కార్డు గాని ఇవ్వలేదు అన్నారు.ఇప్పటికి ప్రభుత్వం 10 స్కీములు అమలు చేస్తుందని ప్రతిపక్షాలు, ఓర్వలేని వారు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య,ఏఎంసి వైస్ చైర్మన్ సబ్బని రాయమల్లు,ఎంపీడీవో పూర్ణచందర్,మాజీ జెడ్పిటిసి లంక సదయ్య,మండల యూత్ అధ్యక్షుడు సోన్నాయి టెంకం శివరామకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునిర్,మాజీ సర్పంచ్ లు తుల మనోహర్ రావు,మదాసు సతీష్,ఆకుల చిరంజీవి,మాజీ ఎంపీటీసీ కొత్తూరి లక్ష్మీ- మొండయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు
Recent Comments
Hello world!
on