నిజామాబాద్ జిల్లాలో పది వేల కోట్ల స్కాం..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ముదస్సర్ అలీ మార్చి 11 (ప్రజా కలం)
పిల్లల చదువులకో, కూతురి పెళ్లికో, ఇండ్లు కట్టుకోవడానికో ఇంకేవో అవసరాలకు పనికొస్తాయనే ఆశతో చిట్స్ అండ్ ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులను నిలువుగా ముంచేసిన ఓ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ జిల్లాలో రూ. 3 కోట్లకు టోకరా వేసి బోర్డు తిప్పేసింది.
ఈ అక్షర కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది బాధితులకు సంబంధించిన రూ.10 వేల కోట్ల స్కాం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సుమారు 72 మంది వరకు బాధితులు తమకు జరిగిన మోసంపై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన ఘటన నిజామాబాద్ నగరంలో వెలుగు చూసింది. కంపెనీ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో వేస్తే అకౌంటులో జీరో బ్యాలెన్స్ చూపిస్తోందని బాధితులు వాపోయారు. అక్షర చిట్స్అండ్ ఫైనాన్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.
అక్షర చిట్స్అండ్ ఫైనాన్స్ లో రూ.10 లక్షల చీటీలో తాను 2019 లో మెంబర్ గా జాయినైనట్లు వ్యవసాయ శాఖ ఉద్యోగి దేవీసింగ్ తెలిపారు. స్థానికంగా ఉన్న కృష్ణారావు అనే ఏజెంట్ ద్వారా కంపెనీలో చీటీ మెంబర్ గా జాయిన్ అయినట్లు దేవీసింగ్ తెలిపారు. 47 నెలల వరకు తాను చీటీ కిస్తులు చెల్లించిన తరువాత చీటీ డబ్బులు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. కంపెనీ వారు తనకు నెఫ్ట్ చెక్కులు ఇచ్చినట్లు తెలిపారు. డబ్బులు క్లెయిమ్ చేసుకోడానికి బ్యాంకుకు వెళితే అకౌంటులో బ్యాలెన్స్ లేదని తేలిందన్నారు. అమౌంట్ ఉంటే తప్ప వాటిని క్లెయిమ్ చేసుకోవడం వీలుపడదన్నారు. బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండానే తమకు నెఫ్ట్ చెక్కులిచ్చి మోసం చేసిన విషయాన్ని తాము గుర్తించామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బ్రాంచి కాగా ప్రధాన బ్రాంచి వరంగల్ లో ఉంటుందన్నారు. జిల్లాలో దాదాపు 72 మంది బాధితులున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది బాధితులున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో రూ.3 కోట్ల స్కాం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల కుంభ కోణం జరిగిందని దేవీసింద్ తెలిపారు. మెంబర్ల నుంచి ప్రతినెలా కలెక్ట్ చేసిన డబ్బులను రియల్ ఎస్టేట్, వెంచర్లు తదితర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి తమను మాత్రం కంపెనీ మోసం చేస్తోందన్నారు.
దాదాపు ఏడాదిన్నర నుంచి తమ డబ్బులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దేవీసింగ్ ఆరోపించారు. కొంతమంది ఇది వరకే చీటి లేపుకున్న మెంబర్ల డబ్బులను తమ కంపెనీలోనే డిపాజిట్ చేస్తే ప్రతినెలా వడ్డీ చెల్లిస్తామని, అధిక లాభాలొస్తాయని నమ్మించి డిపాజిట్ చేయించుకున్నారన్నారు .ప్పుడు ఆ డబ్బులు కూడా రావడం లేదన్నారు.
2019 నుంచి చీటీ వేసిన తాను జూన్ 23 న రూ. 1.20 లక్షలకు పాట పాడి చీటీ ఎత్తుకున్నట్లు ఓ రిటైర్డ్ ఉద్యోగి తెలిపారు. తనకు చీటీ డబ్బులకు చెక్కులిచ్చినా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ చైర్మన్ పేరాలు శ్రీనివాస్ ఎండీ వారి కుటుంబసభ్యులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం,హైదరాబాద్ నగరాల్లో వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసి,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని మరో బాధితుడు వాపోయాడు. ఇలాంటి మోసకారి కంపెనీపై ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి ఆదేశించాలని, కంపెనీకి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఓ బాధిత రిటైర్డ్ ఉద్యోగి ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. చాలా మంది తమ ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయనే ఆశతో పెట్టుబడులు పెడితే ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పేయడంతో.. వారంతా రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో పది వేల కోట్ల స్కాం..
Recent Comments
Hello world!
on