ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి – హరి ప్రసాద్ ఏబీవీపీ
ఉస్మానియా యూనివర్సిటీ మార్చి 16, ( ప్రజాకలం న్యూస్ ):
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనకి తీసుకోవాలి అని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరి ప్రసాద్ మీడియా సమావేశం లో అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యునివర్సిటీ వేదికగా విద్యార్థుల సమస్యలను ప్రశ్నిస్తున్న పట్టించుకోకుండా పరిష్కారం చేయడం సాధ్యం కాక ధర్నాలు చేయొద్దు, ప్రశ్నించవద్దు, నినాదాలు ఇవ్వొద్దు అని జారీ చేసిన ఉత్తర్వులని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి విజయాలను సొంతం చేసుకున్న గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి ప్రఖ్యాతిగాంచిన యునివర్సిటీ లో అధికారులు సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టేది పోయి అక్రమ దందాల కోసం యూనివర్సిటీ అధికారులు ఇలాంటి ఉత్తర్వులను జారీ చేశారు.విద్యార్థుల సమస్యలపైన ప్రశ్నించొద్దు అని విద్యార్థుల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ నాయకుల కండువా కప్పుకొని పనిచేస్తున్న యూనివర్సిటీ అధికారులు వెంటనే జారీ ఉత్తర్వులని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ బందుకు పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి – హరి ప్రసాద్ ఏబీవీపీ
Recent Comments
Hello world!
on