రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు
-బాధితుడిని పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతలు
హైదరాబాద్, మార్చి 17:( ప్రజా కలం న్యూస్)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక కార్యదర్శి బీవీ శేఖర్ ను పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పరామర్శించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మూమిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,పిల్లి రాంచందర్, కోశాధికారి రాచమల్ల వెంకటేశ్వర్లు,సీనియర్ జర్నలిస్టు గోవర్ధన్ తదితరులు సోమవారం ఎల్భీనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీవీ శేఖర్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా జరిగిన ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం బీవీ శేఖర్ అంబర్ పేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుపైన వాటర్ వర్క్స్ అధికారులు తవ్వి వదిలేసిన గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on