Saturday, April 5, 2025
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఓటరు జాబితా సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్.
ఖమ్మం, మార్చి18( ప్రజా కలం న్యూస్)
ఖమ్మం జిల్లా ప్రతినిధి (రాయబారపు రమేష్)
ఖమ్మం జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఓటర్ జాబితా సవరణపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటర్ జాబితా చాలా కీలకమని, సరైన ఓటర్ జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు.
ఓటర్ జాబితా, పారదర్శకమైన పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, బ్యాలెట్ పేపర్లు ఎన్నికల వ్యవస్థకు కీలకమని అదనపు కలెక్టర్ అన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎప్పటి కప్పుడు సమీక్ష చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించే సమయంలో తప్పనిసరిగా నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని అన్నారు.
జిల్లాలో ఫారం 6 క్రింద 4 వేల 734 దరఖాస్తులు రాగా, 3 వేల 267 నూతన ఓటర్లను నమోదు చేశామని, 943 దరఖాస్తులు తిరస్కరించామని, 550 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఫారం 7 క్రింద 3 వేల 352 దరఖాస్తులు రాగా, 2450 పరిష్కరించామని, 411 దరఖాస్తులు తిరస్కరించామని, 491 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఫారం 8 క్రింద 11 వేల 820 దరఖాస్తులు రాగా, 9వేల 573 పరిష్కరించామని, 1320 దరఖాస్తులు తిరస్కరించామని, 927 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో ఉన్న 1459 పోలింగ్ కేంద్రాలకు గాను ఈవిఎం గోడౌన్ లో 5 వేల 824 బ్యాలెట్ యూనిట్లు, 2 వేల 202 కంట్రోల్ యూనిట్ లు, 2 వేల 218 వివి ప్యాట్ లు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు వ్యయ వివరాలు నమోదు చేయలేదని అదనపు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరారు. ఓటర్ జాబితా సవరణపై ఎటువంటి సందేహాలు, ఫిర్యాదులు, సూచనలు ఉన్న తెలియజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో బి.ఎస్.పి. పార్టీ ప్రతినిధి సి.హెచ్. నాగేశ్వర్ రావు, బిజెపి పార్టీ ప్రతినిధి జి. విద్యా సాగర్, సీపీఐ (ఎం) పార్టీ ప్రతినిధి ఎన్. నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, బి.ఆర్.ఎస్. పార్టీ ప్రతినిధి లింగా బోయిన సతీష్, టిడిపి పార్టీ ప్రతినిధి పి.టి.ఆర్. కృష్ణ ప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సిహెచ్. స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments