ఆయిల్ పామ్ సాగు పెంపుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.♦
జగిత్యాల ప్రతినిధి మార్చి 18 (ప్రజా కలం)మంగళవారం రోజున సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సకాలంలో ఆయిల్ పామ్ సాగు వివరాలపై రివ్యూ తీసుకున్నారు.
రానున్న 25-26 సంవత్సరంలో మన జిల్లాలో 3500, ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సాగుకోసం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగు పురోగతి పై వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని అన్నారు.
రానున్న 3 మాసాలలో ప్రతి వ్యవసాయ అధికారి తమ మండల గ్రామాల పరిధిలో ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో 50,ఎకరాల్లో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దాని సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేసుకొవాలని అన్నారు.
జిల్లాలో పెద్ద రైతులను ముందుగా గుర్తించి ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తూ, వారిలో ఉన్న భూమిలో కొంత మే ఆయిల్ పామ్ కు డైవర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కనబర్చే రైతుల నుంచి త్వరితగతిన మొక్కలకు, డ్రిప్ కు డీడీ లు కట్టించాలని అన్నారు.ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతుకు సబ్సిడీ అందేలా చూడాలని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ సాగు నీరు అందని రైతులకు గుర్తించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు డైవర్ట్ అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డి.హెచ్.ఎస్.ఓ శ్యామ్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ,లోహియా కంపెనీ సాంకేతిక సలహాదారులు డాక్టర్ ,రంగనాయకులు టెక్నికల్ అడ్వైజర్ , ఉద్యాన అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.