మున్సిపల్ అధికారులూ…
కాస్త ఇటు చూడరూ…
ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న మురికి నీరు….
ఎల్లారెడ్డి మార్చ్ 21 ప్రజా కలం ప్రతినిధి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన పనులలో డ్రైనేజీలు ధ్వంసమయ్యాయి. దీంతో మురికి నీరు రోడ్డుపైనే దుర్గంద భరితమైన నీరు ప్రవహిస్తుంది. పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా దేవి హాస్పిటల్ ముందు డ్రైనేజీ పైప్లైన్లు ధ్వంసం కావడంతో దాని నుండి వచ్చే వాసన కు అటు వైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకొని ఊపిరి బిగపట్టి వెళ్ళవలిసి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ పైపులు పగిలినప్పటికీ వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో రోడ్డు పైననే మురికి నీరు ప్రవహిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారులు కూడా మురికి నీరు నుండి వచ్చే దుర్వాసనకు కస్టమర్లు రాక వ్యాపారపరంగా చాలా నష్టాలు అనుభవిస్తూనామని వాపోతున్నారు. అంతేగాక రోడ్డుపై నుండి వెళ్లే వాహనదారులు, పాద చారులు డ్రైనేజి నుండి వచ్చే దుర్గంధవాసనకు భరించలేక అటువైపుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ అధికారులు డ్రైనేజి నీరు వెళ్ళడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఇటు వ్యాపారులకు అటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులూ… కాస్త ఇటు చూడరూ…
Recent Comments
Hello world!
on