ఈ మలుపు మృత్యుమలుపు
మలుపు దగ్గర స్పీడ్ బ్రేకర్ లేక ప్రమాదాలు
ఇప్పటివరకు ఎంతోమంది ప్రాణాలు కూలిపోయిన
మున్సిపల్ కమిషనర్ అధికారులకు నాయకులకు పట్టింపు లేదా…
ఇటీవల జరిగిన మలుపు వద్ద ప్రమాదంలో ఒకరు మృతి మరొకరు పరిస్థితి విషమం
తక్షణమే స్పీడ్ బ్రేకర్ తో పాటు అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలి
మహేశ్వరం, (ప్రజా కలం)
ఈ మలుపు మృత్యుమలుపు అని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ రావిరాల గ్రామంలో చెరువు కట్ట కింద రోడ్డు మలుపు ఉండడంతో అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో అదేవిధంగా లైట్లు కూడా లేకపోవడంతో స్పీడ్ గా వాహనాలు వచ్చి అదుపు చేయలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చీకట్లో మలుపు కనిపించక స్పీడ్ గా వచ్చి అదుపు చేయలేక ప్రమాదాలు జరిగి చాలామంది ప్రమాదాలు కోల్పోయారని అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ అధికారులు నాయకులకు మాత్రం పట్టింపు లేకపోవడం శోచనీయం
ఎన్నోసార్లు ప్రమాదాలు జరుగుతున ఆయన పత్రికల్లో వచ్చిన స్థానిక ప్రజలు చెప్పిన మున్సిపల్ అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం నాయకుల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని స్థానిక ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే స్పీడ్ బ్రేకర్లతో పాటు లైట్లు ఏర్పాటు చేసి మూలం మలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ మలుపు మృత్యుమలుపు
Recent Comments
Hello world!
on