Saturday, April 5, 2025
Homeతెలంగాణఅమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దాం

అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దాం

అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దాం
వాసవీ శ్రీ నిలయం లో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్ ల సంస్మరణ సభ.
ఎల్ బి నగర్మా ర్చి 23 (ప్రజాకలం)
జీవితంలో రెండు దానాలు గొప్పవి.1.అన్నదానం. 2.రక్తదానం. మొదటిది సాటి మనిషి కడుపు నింపితే… రెండవది సాటి మనిషి ప్రాణాలు నిలబెడుతుంది.
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చ్23, ఆదివారం రోజున
(అమరవీరుల దినోత్సవం సందర్భంగా) వాసవీ శ్రీ నిలయం, చింతలకుంట , ఎల్ బి నగర్ లో రక్తదాన శిబిరం మరియు అమర వీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ అతిథిగా డా౹౹ మాదాల రవి నటుడు,నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య అతిథిగా శ్రీమతి ఉదయభాను నటి,వ్యాఖ్యాత, ప్రత్యేక అతిథిగా శ్రీమతి మాధవీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,సి.ఐ.డి హైదరాబాద్ గారు విచేసినారు. రక్తదాన శిబిరంను డా౹౹ మాదాల రవి గారు ప్రారంభించినారు. ఈ సంధర్బంగా డా మాదాల రవి మాట్లాడుతూ రక్తదానం అనేది మనందరి కనీస బాధ్యత. ఆసుపత్రికి వెళ్ళే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కొన్నిసార్లు రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్నారు. రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే. మనం ఇచ్చే రక్తం ఆ రోజు కాకపోయిన మరో రోజు ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అనీ అన్నారు. ఈ నాడు దేశ యువత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల అమరత్వాన్ని తలచుకొని దేశం కోసం, సమైక్యత కోసం కృషి చేయాలని అన్నారు. వాసవీ శ్రీ నిలయం లో ఒకవైపు రక్త దాన శిబిరం మరో వైపు షహీద్ దివస్(అమర వీరుల సంస్మరణ సభ) నిర్వహించడం లో మాభూమి సంస్థ కృషిని అభినందించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటి ఉదయ భాను గారు,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,సి.ఐ.డి మాధవీ లత గారు అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక సభ్యులు నరసింహ ప్రసాద్, ఉదయశంకర్, నాగిరెడ్డి, కేశవ రావు, ఎన్ ఎస్ ఆర్ మూర్తి, శరణ్య, పద్మలత, అలివేలు మంగ, ఇంజమూరి రఘునందన్, శంకర్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా పోటీ పడి రక్తదానం చేయడం జరిగింది. వాసవీ శ్రీ నిలయం నివాసితులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments