గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరి యువకుల అరెస్టు
జగిత్యాల క్రైమ్, మార్చ్ 06 (ప్రజాకలం ప్రతినిధి) : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల శివారులోని ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ కట్లకుంట రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నరనే సమాచారం తెలియగానే వెంటనే మేడిపల్లి ఎస్.ఐ శ్యామ్ రాజ్ తన సిబ్బంది తో కలసి మేడిపల్లి శివారులోని ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ వద్ద కట్లకుంట రోడ్డుకు చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు, వెంటనే పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో యువకులు గంజాయి అమ్ముతున్నట్టు తేలింది. గోల్కొండ హరీష్ తండ్రి శంకర్ కులం ఎస్.సి మాల, నివాసం- మెట్ పల్లి పట్టణం జగిత్యాల జిల్లా, బొల్లంపల్లి అభిషేక్ విష్ణువర్ధన్ కులం గోసంగీ, నివాసం-శాంతినగర్ , మెట్ పల్లి పట్టణం, జగిత్యాల జిల్లా ఇద్దరు వద్దనుండి సుమారు రెండు కిలోల రెండు వందల గ్రాముల గంజాయిని, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి గంజాయి విలువ సుమారు 1,00,000/-రూపాయలు కలదు అని పోలిస్ వారు తెలిపారు.
వీరు ఇద్దరు ఒరిస్సాకు చెందిన దీపక్, సూరజ్ అనే వ్యక్తుల నుండి తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్ లు గా చేసి జగిత్యాల జిల్లా మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల పరిసర ప్రాంతాల గ్రామాలలో అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలిపానారు. వీరిపై గతంలో మెట్ పల్లి, మేడిపల్లి పోలిస్ స్టేషన్ లలో గంజాయి కేసులు నమోదు అయ్యాయి నిందితుడలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించరు ఈ కేసులో పరారిలో ఉన్న మరొక నిందితుడైన దీపక్ సూరజ్ ను త్వరలో పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామని మెట్ పల్లి డి.ఎస్.పి. రాములు తెలిపినారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్ఐ జి. శ్యామ్ రాజ్, సిబ్బంది అనిల్ కుమార్, చంద్ర శేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్ లను మెట్ పల్లి డి.ఎస్.పి. రాములు నగదు బహుమతితో అభినందిచారు. అనంతరం మెట్ పల్లి డి.ఎస్.పి. రాములు మాట్లాడుతూ యువత ఎవరు కూడా మత్తు పదార్థాలు, గంజాయి సేవించ రాదని, ఓక వేళా ఇట్టి చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారిపైన కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.